వైజాగ్ కెమికల్ లీక్ మృతులకు కోటి పరిహారం: జగన్

by srinivas |
cm-ys-jagan
X

విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న కెమికల్ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అలాగే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని తెలిపారు. ఈ ఘటనలో గాయపడి, రెండుమూడు రోజులు చికిత్స పొందే వారికి లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు. 5 బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. మరణించిన పశువు యజమానులకు పరిహారంగా 25 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు.

కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృత్యువాతపడ్డారు. కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణమూర్తి (73)తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో మృతుడు చంద్రమౌళి విశాఖపట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్‌ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో వుండడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

tags: ap, vizag, ap cm, ys jagan, lg polymers deaths

Advertisement

Next Story

Most Viewed