- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరసనలు, పరామర్శలు.. రంగంలోకి యోగి సర్కార్..!
దిశ, వెబ్‌డెస్క్ :
యూపీలోని హాథ్రాస్‌లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ అనంతరం మృతదేహాన్ని అర్థరాత్రి పోలీసులే దహనం చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఎం యోగి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు, వామపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. నిందితులను రక్షించడానికి యూపీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను యూపీ పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్ కిందపడిపోయారు. ఆ విషయం జాతీయ మీడియా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ఉమాభారతి యూపీ ప్రభుత్వంపై మండిపడ్దారు. దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు యోగి సర్కార్ అనుమతించింది. దీంతో శనివారం కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హాథ్రాస్‌కు వెళ్లారు.
అంతకుముందుకు హాథ్రాస్ ఘటనలో మనీషాపై అత్యాచారం జరగలేదని, రేప్ చేయడానికి యత్నించిన సమయంలో ప్రతిఘటించిన ఆమెపై నలుగురు దుండగులు పాశవికంగా దాడి చేసి హత్యచేశారని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. కాగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యోగి సర్కార్ ఈ కేసు విషయంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించడమే కాకుండా, రేపు సాయంత్రం 4గంటలకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హాథ్రాస్ బాధిత కటుంబ సభ్యులతో సీఎం యోగి మాట్లాడారు.కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, 25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీఇచ్చారు.