వనపర్తికి సీఎం కేసీఆర్.. ఏర్పాట్లు చేస్తోన్న టీఆర్ఎస్ శ్రేణులు..

by Shyam |   ( Updated:2021-12-12 11:09:58.0  )
Chief Minister KCR
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వనపర్తి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఈనెల 17 నుండి 20వ తేదీ మధ్య ఏదో ఒక తేది ఖరారు కానున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు తెలిపారు. నియోజకవర్గంలోని మెజారిటీ మండలాల మీదుగా వెళతారని, ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి లో జరిగే కార్యక్రమాలు, సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాలు, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశెనగ పరిశోధన కేంద్రం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి కార్యాలయ సిబ్బంది వెల్లడించారు.

Advertisement

Next Story