- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేలకు కార్పొరేట్ వైద్యంపై సీఎం జవాబు చెప్పాలి
దిశ, న్యూస్‌బ్యూరో: సామాన్యులకు, సంపన్నులకు గాంధీలోనే వైద్యసేవలన్న సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలకు కార్పొరేట్ వైద్యంపై ప్రజలకు జవాబు చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ట మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మందకృష్ణ మాదిగ ఓ ప్రకటన చేశారు. కరోనా వైద్యసేవలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన… ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, వైద్యసేవలకు ప్రభుత్వ నిర్ణయించిన రేట్లు పేద ప్రజలకు అందుబాటులో లేవన్నారు. లాక్‌డౌన్‌లో పేదలు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతుంటే ప్రభుత్వం కరోనా వైద్యంతో వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని, పారాసిటమాల్ గోలి వేసుకుంటే చాలని మాట్లాడారని గుర్తుచేశారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవాన్ని వందలమందితో నిర్వహించి కేసీఆరే లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారన్నారు. గచ్చిబౌలి టిమ్స్‌లో అత్యాధునిక సదుపాయాలతో చికిత్స అందిస్తామని ప్రచారం చేసి ఇప్పుడు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో రేట్లు నిర్ధారించడం ఏంటని ప్రశ్నించారు.