హస్తినకు కేసీఆర్.. మోడీని ఢీకొట్టేందుకేనా?

by Anukaran |   ( Updated:2020-12-10 21:06:58.0  )
హస్తినకు కేసీఆర్.. మోడీని ఢీకొట్టేందుకేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈరోజు (శుక్రవారం) ఉదయం 10గంటలకు ఢిల్లీ టూర్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఆయనే అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించునున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు , విపక్ష నాయకులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

అనంతరం కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత కొన్నిరోజులుగా ఆందోళనలు చేపడుతున్న రైతు సంఘాల నేతలతో కూడా సమావేశం కానున్నట్లు సమాచారం. అలాగే ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌కు కేటాయించిన స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. చివరగా ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారైతే మోడీతో భేటీ కానున్నారు. కాగా, ప్రధాని మోడీ కంటే ముందే విపక్షాలు, రైతు సంఘాల నేతలతో భేటీకి కేసీఆర్ సిద్ధమైతే అది కేంద్ర నాయకత్వాన్ని ఢీ కొట్టేందుకు హింట్ ఇచ్చినట్లు అవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed