దుబ్బాక గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యింది

by Shyam |   ( Updated:2020-10-29 04:38:23.0  )
దుబ్బాక గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యింది
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలుస్తుందన్న కేసీఆర్.. గ్రౌండ్ చాలా క్లియర్‌గా ఉందని, అప్పటివరకు అన్ని తతంగాలు నడుస్తాయని పేర్కొన్నారు. 20రోజుల తర్వాత వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ మొదలవుతుందని, ఓపెన్‌ ప్లాట్లు కూడా నమోదు చేసువాలని, బయట వాళ్లకు తెలియకుండా హైడ్ ఆప్షన్ కూడా ఉందని పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story