- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి..!
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ వైద్యుడు, ఏపీ సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గంగిరెడ్డి సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. పులివెందులలో పేదల వైద్యుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఈసీ గంగిరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇటీవలే సీఎం జగన్ హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో ఉన్న తన మామను పరామర్శించి వచ్చారు. ఈసీ గంగిరెడ్డి మృతి చెందడంతో సీఎం జగన్ పులివెందులకు రానున్నారు. పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఇవాళ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.
Next Story