- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీ సూచనను పాటిస్తున్నాం.. ప్రధాని మోడీకి జగన్ లేఖ

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో త్వరితగతిన దానికి అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ఈ మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఈ సూచనను పరిగణలోనికి తీసుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని అందులో పేర్కొన్నారు.
అయితే, తమ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొరత ఉందని, ‘టీకా ఉత్సవ్’ కార్యక్రమానికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే వెంటనే 25లక్షల డోసులను పంపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కేంద్రం సూచన మేరకు పెద్దఎత్తున టెస్టులు జరుపుతున్నామని, అందుకు అనుగుణంగా వ్యా్క్సినేషన్ ప్రక్రియ సైతం కొనసాగుతుందన్నారు. ‘ప్రతి గ్రామం, ప్రతివార్డు’లో టీకా ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. టీకా ఉత్సవ్ ద్వారా రోజుకు 6లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నామన్నారు.