- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలిటిక్స్ కోసం దేవుడ్ని వదలడం లేదు : జగన్
దిశ, ఏపీబ్యూరో : రాష్ర్టంలో రాజకీయాల కోసం విపక్షాలు దేవుణ్నీ వదలడం లేదని సీఎం వైఎస్వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సోమవారం తిరుపతిలో రాష్ర్ట స్థాయి పోలీసు డ్యూటీ మీట్‌ను సీఎం ప్రారంభించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రజలపై ఎలాంటి వివక్ష చూపలేదని పేర్కొన్నారు. అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని చెప్పారు. పార్టీలు, కులాలు, మతాలు చూడాల్సిన అవసరం తమకు లేదని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. మంచి పాలన చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారన్నారు. నేరాలు చేసే వారి మనస్తత్వాలు పూర్తిగా మారిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభమని ప్రశ్నించారు. ఎవరిని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గాలు చేస్తున్నారని సీఎం నిలదీశారు.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సమాజంలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోయాయి. యుగం మారింది. కలియుగంలో క్లైమాక్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడంటే భక్తి, భయం లేని పరిస్థితి నెలకొంది. దేవుని ద్వారా రాజకీయాలు పొందే దారుణమైన క్లైమాక్స్‌లో మనం ఉన్నామన్నారు. సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న రోజుల్లోనే విగ్రహాల ధ్వంసాలు జరగుతున్నాయని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం జరగకూడదనే విగ్రహ ధ్వంసాల కుట్రలు జరగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడు మంచి పనులు చేస్తుందో అప్పుడే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తు చేశారు. 20 వేల ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు ఆలయాలు, ప్రతిపక్ష నాయకుల ఆలయాల్లో ఘటనలు జరుగుతున్నట్లు తెలిపారు.రాజకీయపరంగా జరుగుతున్న ఈ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులు అడ్డుకోవాలని సీఎం ఆదేశించారు.
పోలీసు సేవలు అమోఘం : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
కొవిడ్ సమయంలో పోలీసులు వెనకడుగు వేయకుండా గొప్పసేవలు అందించారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కొనియాడారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్టేట్ పోలీస్ మీట్‌కు ఇగ్నైట్ అనే పేరు పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను జాతీయ స్థాయి ప్రమాణాలతో జరుపుతున్నారు. డ్యూటీ మీట్‌లో నిర్వహించే 18 రకాల పోటీల్లో అన్ని విభాగాల పోలీసు శాఖలకు చెందిన 450 మంది పాల్గొంటారు. 40 మంది ఐపీఎస్ అధికారులు హాజరవుతున్నారు. తిరుపతిలో పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాయలసీమ డీఐజీ కాంతి రాణా ఠాణా, అర్బన్‌ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.