- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీలాంటొళ్లను మస్తు జూసినం.. నువ్వెంత ఆప్ట్రాల్ !
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఓరేంజ్‌లో మండిపడ్డారు. ముఖ్యమంత్రివా లేకుంటే భూముల బ్రోకర్ వా అని వ్యాఖ్యానించారు. నీలాంటొళ్లను ఎంతోమందిని చూశామని, నువ్వెంత ఆఫ్ట్రాల్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కురుమిద్ద గ్రామంలో ఫార్మాసిటీ భూ బాధిత రైతుల సమావేశంలో పాల్గొన్న భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు ఇందిరమ్మ పేదల కోసం భూములు కేటాయిస్తే… కేసీఆర్ దళారీగా మారి ఆ భూములను కార్పొరేట్లకు పంచుతున్నారన్నారు. మనం పోరాటం చేస్తే పోయేది బానిస సంకెళ్లే అన్నారు.
ఇందిరమ్మ పంపిణీ చేసిన 8వేల ఎకరాలు, రైతుల 12వేల ఎకరాల వ్యవసాయ భూములను ఫార్మాసిటికి ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులు, పేదల భూమికి ఎవరైనా అడ్డువస్తే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకోరన్నారు. భూమికి మనిషికి భావోద్వేగపూరిత బంధం ఉందని.. దానిని లాక్కుంటే సహించేది లేదని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.