మళ్లీ ఎడ్లబండ్లపై తిరగాల్సిన పరిస్థితి వస్తోంది : భట్టి

by Sridhar Babu |
CLP leader Bhatti Vikramarka
X

దిశ‌, ఖ‌మ్మం: ఇష్టానుసారంగా నిత్యావసర ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం ఏఐసీసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా పెట్రోల్ రేట్లకు నిరసనగా ఎడ్లబండ్లతో ర్యాలీ తీసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. డీజిల్, పెట్రోల్ రేట్లు ఇలాగే పెరిగితే సామాన్య ప్రజానీకం మళ్లీ ఎడ్లబండ్లు, సైకిల్‌లపై తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుందని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు , టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, మామిడి వెంకన్న, దొబ్బల సౌజన్య, చంద్రిక, బొడ్డు బొందయ్య, కందుల గురునాదం, మధిర, ఖమ్మం, పాలేరు, వైరా నియోజకవర్గ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story