లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఒంటరైన రాజన్న..

by Sridhar Babu |   ( Updated:2021-05-12 00:59:45.0  )
లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఒంటరైన రాజన్న..
X

దిశ, వేములవాడ: లాక్ డౌన్ తో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ను అధికారులు బుధవారం మూసివేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో స్వామి వారి ఆలయంలో భక్తులకు దర్శనం కు అనుమతి లేదు. దీంతో భక్తులు రాకుండా ఆలయానికి మూసివేసి తాళం వేశారు. స్వామి వారి కైంకర్యాలు అంతరికంగానే నిర్వహిస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడిన ఆలయం ,ఇప్పుడు భక్తులు లేక వెలవెల బోయింది. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు భక్తులకు అనుమతి లేదని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపాడు.

Advertisement

Next Story