క్లస్టర్ల నిర్వహణ పద్దతిగా జరగాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి

by  |

దిశ, నిజామాబాద్ : కంటామినెంట్ క్లస్టర్ల నిర్వహణ ఓ ప్రణాళిక, పద్థతి ప్రకారం జరగాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ కార్తీకేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌, పోలీస్ అండ్ హెల్త్, మున్సిపల్ అధికారులతో క్లస్టర్ల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఓ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైతే ఆ ప్రాంతంలో ఒక కిలోమీటర్ రేడియస్‌లో కంటామినెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ ప్రాంతంలో నో మూమెంట్ పాటించాలని, పాజిటివ్ కేసులు నమోదైన ఇంటి దగ్గర, కమర్షియల్ దుకాణాలు ఉంటే షిఫ్ట్ చేయాలన్నారు. అదేవిధంగా హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందించాలని, ఇతరులకు ఆ క్లస్టర్ పరిధిలో వస్తువులు దొరికేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి చేయాలన్నారు. పాజిటివ్ కేసులున్న ప్రదేశాలకు వెళ్లే దారులు పోలీస్ కంట్రోల్‌లో ఉండాలన్నారు ఆయా క్లస్టర్‌ల పరిధిలో బౌండరీలు, రూట్ మ్యాపులు తయారు చేసుకోవాలని కలెక్టర్ వివరించారు.సమావేశంలో శిక్షణా ఐపీఎస్ అధికారి కిరణ్, అదనపు కలెక్టర్ లత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown,collecter narayana reddy, claster run as a process

Advertisement

Next Story

Most Viewed