- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పటివరకు దేశీయ విమాన సేవలపై ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశీయ విమాన సేవలపై ఆంక్షలు నవంబర్ 24వరకు యథాతథంగా కొనసాగుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న పరిమిత సంఖ్య విమానాలూ యథావిధిగా కొనసాగుతాయని వివరించింది. ఈ నిబంధనలు తదుపరి ఆదేశాలు లేదా నవంబర్ 24 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మార్చి 25 నుంచి దేశీయం, అంతర్జాతీయ విమానసేవలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, అన్‌లాక్‌లో భాగంగా క్రమంగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగానే దేశీయంగా కొన్ని మార్గాలలో కొన్ని విమానాలకు అనుమతులనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, అంతర్జాతీయ ప్యాసింజర్ విమానసేవలపై పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగుతున్నాయి. వందేభారత్‌లాంటి కొన్ని ప్రత్యేక సేవలందిస్తున్నవి మాత్రమే నడుస్తున్నాయి.