సిటీ ఆర్టీసీ బస్సులో మంట‌లు..

by Shyam |
సిటీ ఆర్టీసీ బస్సులో మంట‌లు..
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో సాగ‌ర్ ర‌హ‌దారిపై ఆర్టీసీ బ‌స్సులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌త‌తో ప్ర‌యాణికుల‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న (AP 11Z 7537) బ‌స్సులో వెనుకనున్న ఇంజిన్ నుంచి అకస్మా‌త్తుగా మంట‌లు చెల‌రేగాయి. మంటలను గ‌మ‌నించిన ప్ర‌యాణికులు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై రోడ్డు ప‌క్క‌న నిల‌పేశారు. వెంట‌నే స్పందించిన స్థానికులు నీళ్లు చ‌ల్లి మంట‌లను ఆర్పారు. దీంతో ప్ర‌యాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story