చిక్కుల్లో పడ్డ సిటీ బ్యాంకు

by Shyam |
చిక్కుల్లో పడ్డ సిటీ బ్యాంకు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక చిన్న పొరపాటు కారణంగా ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ రంగ సిటీ బ్యాంక్ (Citibank)చిక్కుల్లో పడింది. ఈ బ్యాంకుకు చెందిన న్యూయార్క్ శాఖ (New York Branch)లో జరిగిన పొరపాటు వల్ల సౌందర్య ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ రెవ్లాన్‌ (Cosmetics giant Revlon)కు చెందిన కంపెనీ రుణదాతల ఖాతాల్లోకి ఏకంగా రూ. 6,700 కోట్లు జమయ్యాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల రెవ్లాన్ (Revlon) కంపెనీ రుణదాతలకు సుమారు 3 బిలియన్ డాలర్లు బకాయి పడింది. ఇవి సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో రుణాలిచ్చిన కంపెనీలు అసహనాన్ని వ్యక్తం చేశాయి. టరంలోన్ రాబోయే మూడేళ్లలోగా చెల్లించాలంటూ కేసులు వేశాయి. ఇందులో సిటీబ్యాంకు (Citibank)ను కూడా ప్రతివాదిగా చేర్చాయి. ఈ క్రమంలోనే క్లరికల్ లోపాలతో సిటీబ్యాంకు రూ. 6,700 కోట్లను(900 మిలియన్ డాలర్లు) పొరపాటుగా రెవ్లాన్ అకౌంట్ నుంచి రుణదాతల (Creditors) అకౌంట్లలోకి మళ్లించిది.

దీంతో, ఆశలు వదులుకున్న రుణదాతలు (Creditors)తిరిగి ఇవ్వడానికి తిరస్కరించారు. ఇప్పటికే రుణదాతలకు, రెవ్లాన్ కంపెనీ (Revlon Company)కి ఉన్న వివాదంలో సిటీ బ్యాంకు (Citibank) మరింత ఆజ్యం పోసినట్టైంది. అయితే, ఈ వ్యవహారం శతాబ్దానికే అతిపెద్ద పొరపాటు అని వినిపిస్తున్న వార్తలను బ్యాంకు అధికారులు ఖండించారు. ఇది కేవలం లెక్కల్లో వచ్చిన పొరపాటు అని చెబుతున్నారు. అలాగే, ఈ చెల్లింపు తాము చేసింది కాదని, ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రెవ్లాన్ కంపెనీ తెలిపింది. కాగా, ఈ వ్యవహారంపై సిటీ బ్యాంకు అంతర్గతంగా దర్యాప్తు మొదలుపెట్టింది.

Advertisement

Next Story