hair: కిలో వెంట్రుకల ధరెంత.. వీటితో ఏం చేస్తారు..!

by Anjali |
hair: కిలో వెంట్రుకల ధరెంత.. వీటితో ఏం చేస్తారు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మన శరీరంలో వేగంగా పెరిగే వాటిలో గోర్లు(Nails), వెంట్రుకలు(hair) ఒకటి. మగవారు నెలరోజులకోకసారి అయినా.. కటింగ్ షాప్‌కు వెళ్లి హెయిర్ కటింగ్ చేసుకుంటారు. ఇక మహిళలు దేవుడికి మొక్కుతీరు ప్రకారం తలనీలాలు మర్పిస్తుంటారు. అలాగే గ్రామాల్లో వెంట్రుకలు కొనేందుకు కూడా వస్తుంటారు. వెంట్రుకలిస్తే.. పిల్లలకు అవసరమయ్యే ఆట వస్తువులు లాంటివి తిరిగి ఇస్తుంటారు. అలాగే చిన్న చిన్న పాత్రలు కూడా ఇస్తుంటారు. మరీ ఈ హెయిర్స్‌ను ఏం చేస్తారు. ఎందుకోసం వాడుతుంటారు?ఏటేళ్తాయి? అనే సందేహం చాలా మందిలో కలుగుతాయి.

వెంట్రుకలతో కోట్ల వ్యాపారం..

మార్కెట్‌లో హెయిర్స్‌కు భారీ డిమాండ్ ఉంది. వీటితో కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. అలాగే నాణ్యత, పొడవు బట్టి వీటి ప్రైజ్ డిసైడ్ చేస్తారట. అయితే 8 నుంచి 12 అంగుళాల పొడవుగా ఉండే హెయిర్‌కు 8 వేల రూపాయల నుంచి రూ. 10 వేల వరకు పలుకుతుందట. ఈ వెంట్రుకలను విగ్గుల(wigs) తయారీకి వాడుతుంటారట. మహిళల హెయిన్ నాణ్యత కంటే పురుషుల జుట్టే బలంగా ఉంటుందని అధ్యయనం చెబుతోంది. మగాళ్ల జుట్టును సముద్రం(sea)లో ఓడలకు లంగరు వేయడానికి ఉపయోగిస్తారట. వేరే దేశాలతో పోల్చుకుంటే ఇండియా(India)లోనే హెయిర్స్‌కు కోట్లలో వ్యాపారం జరుగుతుందని గుణంకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Next Story