అతను ఇచ్చిన ఆ గిఫ్ట్‌ని మ్యారేజ్ అయ్యేవరకు తీసేయలేదు.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-01-02 06:46:13.0  )
అతను ఇచ్చిన ఆ గిఫ్ట్‌ని మ్యారేజ్ అయ్యేవరకు తీసేయలేదు.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ‘మహానటి’ సినిమాతో ఏకంగా స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. అలాగే నాని నటించిన ‘దసరా’ సినిమాలకు అయితే అవార్డులు కూడా వరించాయి. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన లవ్ విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'మేము 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాము. అతను నాకంటే ఏడేళ్లు పెద్ద. ఆరేళ్ల నుంచి ఖతార్‌లో వర్క్ చేస్తున్నాడు. అయితే ఓ రోజు నేను మా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లా. అక్కడికి ఆంటోని వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉండేసరికి అతడిని కలవలేకపోయాను. కను సైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయా. ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని అప్పుడు చెప్పా. 2010లో ఆంటోని ఫస్ట్ టైం నాకు ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి మా బంధం మరింత బలపడింది. నాకు ప్రామిస్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. మేము పెళ్లి చేసుకునే వరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు ఈ రింగ్‌ను గమనించవచ్చు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Also Read...

ఆ స్టార్ హీరోతో ఆ పని చేయాలన్న కోరిక నెరవేరింది.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed