KCR: తొందరేం లేదు.. వేచి చూద్దాం.. నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్​

by Ramesh Goud |
KCR: తొందరేం లేదు.. వేచి చూద్దాం.. నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress Government)పై పోరాడటానికి తొందరేంలేదని, మరికొంత సమయం వేచి చూద్దామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కే చంద్రశేఖర్​ రావు (BRS President KCR)అన్నారు. శనివారం ఎర్రవల్లి ఫాం హౌస్​లో బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్​రావు తో నల్గొండ జిల్లా(Nalgonda District) ముఖ్య నేతలందరు భేటి అయ్యారు. వారు కేసీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం చేశారు. కాంగ్రెస్​ పార్టీ గత చరిత్ర చూసినా కూడా వాళ్లకు వాళ్లకే దెబ్బతిసుకుంటారని, ఆ పార్టీ చరిత్ర అంతా అదే చెబుతుందని వారితో కేసీఆర్​అన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో ఎక్కడా అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుందని ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వానికి అతి త్వరగా చెడ్డ పేరు, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుందని ఆయన అన్నట్లుగా పార్టీ నాయకులు తెలిపారు. ఇంత త్వరగా ఇంత ఎక్కువగా వ్యతిరేకత, తెచ్చుకుంటుందని తాను ఆనుకోలేదన్నారు. ప్రభుత్వంపై పోరాడటానికి ఇంకా సమయం ఉందని, వారికి మరికొంత సమయం ఇద్దామని, ప్రజలకు వారికి అధికారం ఇచ్చారు కాబట్టి వేచి చూద్దామంటూ సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది. కేసీఆర్ నుకలిసిన వారి మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ మాజీ చైర్మన్​లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed