Vidyut Soudha : విద్యుత్ సౌదా ముందు ఏఈ అభ్యర్థుల ధర్నా

by Y. Venkata Narasimha Reddy |
Vidyut Soudha : విద్యుత్ సౌదా ముందు ఏఈ అభ్యర్థుల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామక పత్రాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జెన్ కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ అభ్యర్థుల ఖైరతాబాత్ లోని విద్యుత్ సౌదా ముందు ధర్నాకు దిగారు. నియామక పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యక కూడా నియామక పత్రాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వారు ధర్నా చేపట్టారు. వెంటనే తమకు పోస్టింగ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 2023 ఆక్టోబర్ 4న ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వగా, 2024జూలై 14న పరీక్షలు నిర్వహించారని, సెప్టెంబర్ 18న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారని..ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని మండిపడ్డారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికే సెలెక్ట్ అయిన వారు కొందరు రాజీనామా చేసి ఇతర ఉద్యోగాల్లో చేరిపోయారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగ నియామకాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమకు పోస్టింగులు ఇచ్చి న్యాయం చేయాలని వారు కోరారు.

Advertisement

Next Story

Most Viewed