దమ్మున్న వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా "దిశ "...

by Sumithra |
దమ్మున్న వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా దిశ ...
X

దిశ, షాద్ నగర్ : సమస్యల పై ఎప్పటి కప్పుడు వార్తా కథనాలను అందిస్తూ సంచలనాత్మక, దమ్మున్న వార్తలకు అడ్రస్ గా దిశ దినపత్రిక మారిందని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. గురువారం షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దిశ దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ దినపత్రిక వచ్చిన కొద్ది కాలంలోనే వార్తలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుందని, ఎప్పటి వార్తలను అప్పుడు పాఠకులకు అందజేస్తూ తనదైన మార్కు ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. తన కథనాలతో సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మోహన్, నాయకులు దంగు శ్రీనివాస్ యాదవ్, చెంది తిరుపతి రెడ్డి, అంబటి ప్రభాకర్, సీతారాం, రాయికల్ శ్రీనివాస్, సురేష్ గౌడ్, దిశ దినపత్రిక షాద్నగర్ ఆర్సీ ఇంచార్జ్ రమేష్, కేశంపేట రిపోర్టర్ రామకృష్ణ గౌడ్, నందిగామ రిపోర్టర్ అశోక్, కొత్తూరు రిపోర్టర్ కిరణ్, కొందుర్గు రిపోర్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed