- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టీసీ సిబ్బంది పెద్ద మనస్సు..
దిశ, వేములవాడ : ఆర్టీసీ సిబ్బంది పెద్ద మనస్సుతో ఆలోచించి ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్ ను తిరిగి ప్రయాణికుడికి అందజేసిన సంఘటన గురువారం వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డిలో బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడు సిరిసిల్ల బస్టాండ్ వద్దకు బస్సు చేరుకోగానే బస్సులో నుండి దిగి మరుగుదొడ్డికి వెళ్ళాడు. ఈ క్రమంలో తన బ్యాగును బస్సులోనే మర్చిపోగా బస్సు అప్పటికే వేములవాడకు చేరుకుంది.
దీంతో ఆందోళన చెందిన ప్రయాణికుడు వెంటనే విషయాన్ని అక్కడి కంట్రోలర్ కు తెలపగా ఆయన వెంటనే వేములవాడ కంట్రోలర్ ఫోన్ చేసి జరిగిన సంఘటనను తెలిపారు. ఈ క్రమంలో వేములవాడ బస్టాండ్ లో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సూపర్వైజర్ సత్యనారాయణ, పి.ఆర్వో శ్రీనివాస్ యాదవ్, ప్యాసింజర్ గైడ్ కొండయ్యలు బస్సులోని బ్యాగ్ ను స్వాధీనం చేసుకొని బ్యాగుతో పాటు అందులోని రూ. 75 వేల నగదును ప్రయాణికుడికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుడు మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.