మేకల కాపరి పై ఎలుగుబంటి దాడి...

by Sumithra |
మేకల కాపరి పై ఎలుగుబంటి దాడి...
X

దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మండలం గుంటపల్లి చెరువు తండాలో భూక్యా నరేష్ అనే మేకల కాపరి పై ఎలుగుబంటి బుధవారం దాడి చేసింది. భూక్య నరేష్ మేకలు కాయడానికి అడవికి వెళ్ళాడు. ఈ క్రమంలో అక్కడే ఓ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరేష్ పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడి చేతికి గాయం అయ్యింది. స్థానికులు వెంటనే అతడిని ఎల్లారెడ్డి పేటలో గల ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed