- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Flights Delay: పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం
దిశ, వెబ్‌డెస్క్: పొగమంచు (Heavy Fog) కారణంగా దేశ వ్యాప్తంగా విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇవాళ గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)లో విమానాల ల్యాండింగ్ (Landing), టేకాఫ్ (Take Off) కష్టంగా మారినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ (Airport Authority) అధికారులు వెల్లడించారు. అందుకు ప్రధాన కారణం దట్టమైన పొగమంచేనని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)కు రావాల్సిన హైదరాబాద్ (Hyderabad), బెంగుళూరు (Bengaluru), విశాఖపట్నం (Vishakhapatnam), ఢిల్లీ (Delhi) విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు. మరోవైపు ఫ్లైట్స్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. శీతాకాలం వెళ్లేంత వరకు ముఖ్యంగా ఉదయం వేళల్లో విమానాల ల్యాండింగ్ కష్టమేనని ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పష్టం చేశారు.