- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirumala : మరోసారి శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala) ఆలయం మీదుగా విమానాలు వెళ్లరాదన్న(Flights Prohibition) ఆలయ నియమాలు తరుచు ఉల్లంఘనల(Violations)కు గురవుతుండటం వివాదస్పదమవుతుంది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం వెళ్లింది. అయితే ఆగమశాస్త్రానుసారం శ్రీవారి ఆనంద నిలయంపై ఎలాంటి విమాన సంచారం ఉండకూడదని గతంలోనే ఆగమ పండితులు స్పష్టం చేశారు. అయినప్పటికి తరుచు తిరుమలలో ఆగమశాస్త్ర ఉల్లంఘనలు కొనసాగుతూ విమాన సంచారాలు సాగుతుండటం పట్ల పండితులు, భక్తులు మండిపడుతున్నారు.
ఈ ఏడాది జూన్ 7న శ్రీవారి ఆలయ సమీపం మీదుగా విమానం వెళ్లగా, ఫిబ్రవరి 15న ఆలయం గోపురం పైనుంచి రెండు జెట్ విమానాలు వెళ్లాయి. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ (No-fly zone)గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో శ్రీవారి ఆలయం పైనుంచి అడప దడపా విమానాలు వెళ్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని అధికారులకు కేంద్రం గతంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ హామీ కూడా అమలు కాకపోవడం భక్తులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైన తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతున్నారు.
Also Read...
Cabinet Meeting: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. భవనాలు, లేఅవుట్ల అనుమతులు మున్సిపాటీలకు