Pushpa-2: అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సెంటిమెంట్.. వైరల్‌గా మారిన టీ షర్ట్

by sudharani |   ( Updated:2024-12-06 11:44:44.0  )
Pushpa-2: అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సెంటిమెంట్.. వైరల్‌గా మారిన టీ షర్ట్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప-2’ (Pushpa-2) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ (blockbuster) టాక్‌తో దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ‘పుష్ప-2’ పక్కా పైసా వసూళ్లు అన్నట్లుగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ‘పుష్ప’కు సీక్వెల్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ కూడా సెన్సేషల్ హిట్ అయింది. అయితే.. ‘పుష్ప’ రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రన్ చేస్తున్న ‘రౌడీ వేర్’ నుంచి స్పెషల్‌గా తయారు చేసిన టీ షర్ట్ అల్లు అర్జున్ కోసం పంపించాడు.

అదే టీ షర్ట్ వేసుకుని ఐకాన్ స్టార్ ఆర్టిస్టీ క్రాస్ రోడ్ సంథ్య థియేటర్‌కు సినిమా చూసేందుకు వెళ్లాడు. పార్ట్ 1 సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా ‘పుష్ప-2’ కోసం అల్లు అర్జున్‌కు విజయ్ టీ షర్ట్ పంపగా.. ఈ రోజు ఆర్టిసీ క్రాస్ రోడ్ సంథ్య థియేటర్‌లో సందడి చేశారు శ్రీవల్లి, పుష్ప రాజ్. అలాగే.. రష్మిక శ్రీవల్లి టీ షర్ట్, అల్లు అర్జున్ పుష్ప టీ షర్ట్ ధరించిన ఫొటోలను నేషనల్ క్రష్ తన X ఖాతాలో షేర్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. విజయ్ దేవరకొండ టీ షర్ట్ సెంటిమెంట్ ((Sentiment) వర్కౌట్ అయిందా అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed