VIJAY DEVARAKONDA: ఆ ఊపునకు ఏడేళ్లు.. రౌడీ బాయ్ లైఫ్‌ను టర్న్ తిప్పింది ఈ రోజే..

by Kavitha |   ( Updated:2024-08-25 14:42:03.0  )
VIJAY DEVARAKONDA: ఆ ఊపునకు ఏడేళ్లు.. రౌడీ బాయ్ లైఫ్‌ను టర్న్ తిప్పింది ఈ రోజే..
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్విలా మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, ద్వారక, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, గీతా గోవిందం, ఖుషి, ది ఫ్యామిలీ మ్యాన్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే విజయ్ దేవర కొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ తెచ్చిన మూవీ అర్జున్ రెడ్డి. సందీవ్ వంగా దర్శకత్వంలో షాలిని పాండే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో యూత్‌లో ఓ ఊపు ఊపేసింది. అలా ఈ మూవీతోనే విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాకుండా మాస్ హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ఇంత ఇమేజ్ తెచ్చి పెట్టిన ఈ మూవీ రిలీజై ఈ రోజుకు 7 ఏళ్ల. అలా సెవన్ ఇయర్స్ కావోస్తున్న ఈ మూవీకి, అందులోని హీరో ఆటిట్యూడ్‌కి ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు.


Advertisement

Next Story