- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక కోసం అలాంటి త్యాగం చేయబోతున్న వరుణ్-లావణ్య..?
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఇటలీలో వరుణ్-లావణ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వరుణ్-లావణ్య మెడలో నవంబర్ 1న మూడుముళ్లు వేశాడు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో నవంబర్ 5న రిసెప్షన్ చేసుకోవడంతో సెలబ్రిటీలు దీనికి హాజరై సందడి చేశారు. అయితే మెగా కోడలు లావణ్య పెళ్లైన తర్వాత మొదటి పండుగను అత్తారింట్లోనే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలో లావణ్య మెగా డాటర్ నిహారిక కోసం ఓ త్యాగం చేయడానికి సిద్ధపడిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళితే.. ఓ స్టార్ డైరెక్టర్ లావణ్య త్రిపాఠి దగ్గరకు వచ్చి ఓ స్టోరీ చెప్పారట. కానీ దానికి లావణ్య ఈ క్యారెక్టర్‌కు నిహారిక బాగా సూట్ అవుతుందని చెప్పిందట. అయితే ఆ డైరెక్టర్ మాత్రం లావణ్య త్రిపాఠికి నిహారిక వద్దని చెప్పేసాడట. మీరు అయితే ఈ రోల్ లో బాగుంటారు అని మేము అనుకుంటున్నాం.. మీరు ఈ సినిమా చేయండి అంటూ బలవంతం చేస్తున్నారట. ఇదిలా ఉంటే మెగా డాటర్ నిహారిక భర్తతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి మెగా డాటర్ నిహారిక పలు ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
అలాగే నిర్మాతగా మారి పలు వెబ్‌సిరీస్, తెరకెక్కిస్తుంది. ఇటీవల ఓ పెద్ద సినిమాను కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలిపింది. అయితే త్వరలో వరుణ్-లావణ్య కాంబినేషన్‌లో ఓ సినిమాను తీయబోతుందని తెలుస్తోంది. దానికి ఈ కొత్త జంట నిహారిక కోసం ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది. అలాగే ఆమె పెళ్లి చేశాకే పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్.. చెల్లెలి కోసం వరుణ్ తేజ్ మరదలు లైఫ్ కోసం లావణ్య అలాంటి పని కూడా చేస్తారేమో? అని అనుకుంటున్నారు.