Maadhavi Latha: ఆడపిల్లగా నేను ఎప్పుడూ అలా చేయలేదు, కానీ.. నాని హీరోయిన్ ఏడ్చుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ (వీడియో)

by Prasanna |   ( Updated:2025-01-06 03:59:12.0  )
Maadhavi Latha: ఆడపిల్లగా నేను ఎప్పుడూ అలా చేయలేదు, కానీ.. నాని హీరోయిన్ ఏడ్చుకుంటూ ఎమోషనల్ కామెంట్స్  (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అయితే, ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఇంత ఎమోషనల్ గా ఇప్పటీ వరకు ఇలాంటి వీడియో షేర్ చేసింది లేదు. తాను ఏడవడానికి గల కారణాన్ని తన పోస్ట్ లో తెలిపింది.

" చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం .. అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పడే ఇవే మాటలన్నారు. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. ఎక్కడా కూడా రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికి ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు , కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎప్పుడూ కూడా నేను సింపతీ గేమ్ ఆడలేదు. మహిళల చట్టాలను అనుకూలంగా ఉపయోగించలేదు. నేను మగాడిలా పోరాడుతూనే ఉన్నాను .. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోను. నాకు కుటుంబం , స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు , సోషల్ మీడియా లో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు .. నా బాధని మీతో పంచుకున్నందుకు.. క్షమించండి .. మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి " అంటూ మాధవీలత తన పోస్టులో వెల్లడించారు.

గతంలో తనపై కామెంట్స్ చేసిన తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి సారీ చెప్పడంపై ఆమె రియాక్ట్ అయ్యారు. తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా.. అంటూ మాధవీలత గట్టిగా నిలదీసింది. మాధవీలత ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్టింట వైరల్ గా మారడంతో ఆమె ఫ్యాన్స్ అండగా నిలబడుతున్నారు.

చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే …నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి … ..నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి...

Posted by Actress Maadhavi on Sunday 5 January 2025

Advertisement

Next Story

Most Viewed