Aishwarya Rai: శారీరకంగా-మానసికంగా టార్చర్ చేశాడు.. స్టార్ హీరోపై ఐశ్వర్య రాయ్ సంచలన కామెంట్స్

by Anjali |   ( Updated:2024-10-28 04:04:50.0  )
Aishwarya Rai: శారీరకంగా-మానసికంగా టార్చర్ చేశాడు.. స్టార్ హీరోపై ఐశ్వర్య రాయ్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మొన్నటివరకు భర్త అభిషేక్ బచ్చన్‌(Abhishek Bachchan)తో విడిపోతుందంటూ నెట్టింట జోరుగా చర్చించుకున్నారు. ఈ పుకార్లు షికార్లు కొట్టడంతో ఐశ్వర్య రాయ్ సోషల్ మీడియా ద్వారా జనాలకు క్లారిటీ ఇచ్చింది. తాము కలిసే ఉన్నామని తెలియజేయడం కోసం ఫ్యామిలీ పిక్స్‌ను నెట్టింట పంచుకుంది. అయినప్పటికీ ఈ పుకార్లు ఆగడం లేదు. ఈ క్రమంలో ఈ బ్యూటీ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలీవుడ్ మీడియా టాక్ ప్రకారం..

మాజీ విశ్వసుందరి ఓ డాక్టర్‌(doctor)తో క్లోజ్‌గా మూవ్ అవుతుందంటూ మాట్లాడుకున్నారు. దీంతో ఐశ్వర్య అతడు తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అని స్పష్టత ఇచ్చింది. ఐశ్వర్య-అభిషేక్ మధ్య మనస్పర్థలు రావడానికి ఓ మహిళ కారణమని అన్నారు. ఆమె ఎవరో కాదు.. దస్వి మూవీతో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన నిమ్రత్ కౌర్(Nimrat Kaur) అని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదంతా పక్కన పెడితే.. రీసెంట్‌గా బాలీవుడ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. గతంలో ఐశ్వర్యరాయ్ అండ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) మధ్యనున్న రిలేషన్ గురించి ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా.. ఐశ్వర్య ఇలా బదులిచ్చింది.

తను సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. డ్రింక్ చేసి ఐశ్వర్యతో అనుచితంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. ఆ రోజులన్నీ నా లైఫ్‌లో బ్యాడ్ డేస్ అని వెల్లడించింది. అంతేకాకుండా ఆ హీరో ఐశ్వర్యను మానసింగా, శారీరకంగా టార్చర్ చేశాడని తెలిపింది. ఈ కారణాల వల్లే సల్మాన్ తో విడిపోవాల్సి వచ్చిందని ఐశ్వర్య ఇంటర్వ్యూలో వివరించింది. ప్రస్తుతం ఈ నటి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఐశ్వర్యరాయ్ చివరిగా పొన్నియిన్ సెల్వన్(Ponniin Selvan) సినిమాలో కనిపించింది. మణిరత్నం(Mani Ratnam) చిత్రంలో నందిని పాత్రకు ఆమె SIIMA, IIFA అవార్డులు అందుకుంది. అప్పటి నుంచి నటి ఇంకే సినిమాలకు సంతకం చేయలేదు.

Advertisement

Next Story