Vishwambhara ‘విశ్వంభర’ సెట్‌కు విశిష్ట అతిథులు.. ఫుల్ జోష్‌లో మెగాస్టార్ ఫ్యాన్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-11 16:12:32.0  )
Vishwambhara ‘విశ్వంభర’ సెట్‌కు విశిష్ట అతిథులు.. ఫుల్ జోష్‌లో మెగాస్టార్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), యువ దర్శకుడు వశిష్ట(Vassishta) కాంబినేషన్‌లో వస్తోన్న విశ్వంభర చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అశిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. శుక్రవారం విశ్వంభర సినిమా సెట్‌కు విశిష్ట అతిథులు వచ్చారు. అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు వచ్చారు. దీంతో విశ్వంభర సెట్‌లో సందడి వాతావరణం నెలకొంది.

ఇప్పటికే విశ్వంభర చిత్రం నుంచి దసరా కానుకగా చిత్ర టీజర్‌ను విడుదల చేస్తామని మేకర్లు ప్రకటించారు. ఈనెల 12వ తేదీన ఉదయం 10:49 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ విశ్వంభర టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. పోస్టర్‌లో కత్తి పట్టుకొని చిరు ఆవేశంగా వెళ్తున్నట్టు ఉండటంతో టీజర్‌లో సోషియో ఎలిమెంట్స్‌తో పాటు మంచి మాస్ సీన్ కూడా ఉంటుందేమో అని ఆశిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed