Poonam Kaur: రాజకీయం అంటే ఇదేనంటూ పూనమ్ కౌంటర్లు.. వైరల్‌గా మారిన ట్వీట్

by Hamsa |
Poonam Kaur: రాజకీయం అంటే ఇదేనంటూ పూనమ్ కౌంటర్లు.. వైరల్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ కేసులో శుక్రవారం అల్లు అర్జున్‌(Allu Arjun)ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు(Nampally Court) రిమాండ్ విధించడం.. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే రాత్రంతా బన్నీ జైల్లోనే ఉన్నాడు. శనివారం ఉదయం ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల చేశారు.

ఇక నిన్నటి నుంచి అల్లు అర్జున్ కేసు గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై సోషల్ మీడియా(Social Media)లో పలు చర్చలు జరుగుతున్నాయి. బన్నీని అన్యాయంగా అరెస్ట్ చేస్తారా? ఇలా తొక్కిసలాటలో మరణించిన ఘటనలో బన్నీని అరెస్ట్ చేశారు కానీ ఆయన తప్పు లేదని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆయన రావడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని చర్చించుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు మాత్రం బన్నీకి మద్దతుగా నిలుస్తూ పలు పోస్టులు పెడుతున్నారు.

మరికొందరు మాత్రం ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ చట్టం ముందు అందరూ సమానులే అని అంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, పూనమ్ కౌర్(Poonam Kaur) ఓ సెన్సేషనల్ ట్వీట్ చేసింది. ‘‘రాజకీయాల్లో అధికార దుర్వినియోగం జరుగుతోంది. మెరుగైన నాయకత్వం కోసం శక్తిని ఉపయోగించడం’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ ట్వీట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ కేసులో పవర్‌ను ఉపయోగించి బయటకు వచ్చాడని కౌంటర్లు వేసిందని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed