- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt: ఆ అపోహ ఇప్పుడు లేదు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని సంక్షేమ వసతిగృహాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రయివేట్ స్కూళ్లలో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని.. పీవీ నర్సింహా రావు(PV Narsimha Rao) హయాంలో తొలిసారిగా సర్వేల్‌లో సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించారని గుర్తుచేశారు. సర్వేల్‌లో చదవిన అనేక మంది నేడు కీలక పదవుల్లో ఉన్నారని అన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్థుల్లో విశ్వాసం పెంచేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 8 ఏళ్లుగా డైట్ ఛార్జీలు పెంచలేదని విమర్శించారు. తాము డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచి విద్యార్థులకు అండగా నిలబడ్డామని తెలిపారు. తక్కువగా ఉన్న ప్రయివేట్ స్కూళ్లలో ఎక్కువమంది చదువుతున్నారు.. ఎక్కువగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తక్కువమంది విద్యార్థులు చదువుతున్నారు.. అసలు ఇలా ఎందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించాలని సూచించారు.
విద్యార్థుల మీద ప్రభుత్వం చేసేది ఖర్చు కాదని.. పెట్టుబడి అని అన్నారు. విద్యార్థులంతా రేపు రాష్ట్రాన్ని నడిపించే నాయకులు, అధికారులు అని అన్నారు. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. కొన్ని కొన్ని స్కూళ్లలో తరగతులు ప్రారంభమైనా పుస్తకాలు అందడం లేదని ఆవేదన చెందారు. ఇలాంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాదు.. తినే ఫుడ్ విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకులాలు, హాస్టల్స్ విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది? అని అధికారులను ప్రశ్నించారు.