Kriti Shetty: బిజీ అయిపోయిన కృతి శెట్టి.. షూటింగ్‌ స్పాట్ నుంచి క్యూట్ వీడియో వైరల్

by sudharani |
Kriti Shetty: బిజీ అయిపోయిన కృతి శెట్టి.. షూటింగ్‌ స్పాట్ నుంచి క్యూట్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Kriti Shetty).. 2021లో వచ్చిన ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి చిత్రమే మంచి సక్సెస్ అందుకోవడంతో కృతికి ఫాలోయింగ్ పెరిగిపోయి వరుస ఆఫర్లు చుట్టుకుముట్టాయి. దీంతో 2022లో ఏకంగా 4 సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. కానీ, ఏ ఒక్క మూవీ కూడా అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోవడంతో మళ్లీ గ్రాఫ్ పడిపోయినట్లు అయింది. 2023లో కస్టడీ, 2024లో మనమే చిత్రాలతో ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేసిన అవి కూడా నిరాశపరిచాయి. దీంతో ఈ అమ్మడుకి టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి వరకు మరో తెలుగు మూవీని అనౌన్స్ చేయలేదు. ఇక్కడ సైలెంట్ అయిపోయినప్పటికీ తమిళంలో మాత్రం దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

అక్కడ ఏకంగా మూడు చిత్రాలను లైన్‌లో పెట్టి షూటింగ్స్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ కార్తీతో ‘వా వాతియార్’తో పాటు మరో రెండు సినిమాలు చేస్తుంది. వాటిలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany) (LiK) ఒకటి. విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటిస్తుండగా.. SJ సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార (Nayanthara) నిర్మిస్తుంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుతున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా ఇందుకు సంబంధించి విజువల్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇందులో కృతి తిక్ బ్లూ కలర్ ట్రెండీ ఫ్రాక్‌లో ఫోన్ మాట్లాడుకుంటూ దర్శనమిచ్చింది. వాటిని చూసిన నెటిజన్లు వావ్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed