- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమ్మించి నట్టేట ముంచిన యువకుడు..
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : తల్లికి ఆరోగ్యం బాలేదని కొందరిని భార్య అనారోగ్యం బారిన పడిందని మరికొందరిని నమ్మించిన యువకుడు సుమారు 40 లక్షల మేర మోసానికి పాల్పడ్డాడు. సుమారు 15 మందిని ఒకరికి తెలియకుండా ఇంకొకరిని నమ్మిస్తూ క్రెడిట్ కార్డుల నుండి డబ్బులు డ్రా చేశాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని జామ్ భాగ్ కు చెందిన యువకుడు తమను నిండా ముంచినట్లు వాపోయారు. స్థానికంగా ఉండే ఓ సెల్ ఫోన్ స్టోర్లో పనిచేస్తున్న కళ్లెం ఆదిత్య ఈ మోసానికి పాల్పడినట్లు వివరించారు.
మరికొందరితో అయితే ఏకంగా కొత్తగా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయించి మరి డబ్బులు డ్రా చేసినట్లు బాధితులు చెప్పుకొచ్చారు. మోసపోయామని తెలిసి డబ్బులు అడిగితే ఇవ్వడం లేదంటూ యువకుడి ఇంటి ముందు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. కంప్లైంట్ ఇస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మోసానికి పాల్పడ్డ యువకుడు రెండు నెలల నుంచి అజ్ఞాతంలో ఉండడంతోనే తాము ఇంటి ఎదుట బైఠాయించినట్లు బాధితులు తెలిపారు. పోలీసులే ఎలాగైనా తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు కోరారు.