- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సూర్య-45’ మూవీలో స్టార్ హీరోయిన్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మేకర్స్
దిశ, సినిమా: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) హవా నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన ఆమె పెళ్లి కూడా చేసుకోకుండా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో భారీ సక్సెస్ సాధించడంతో త్రిష దశ మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ అగ్ర హీరోల చిత్రాలను అంగీకరిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఏడు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.
ఇందులో విశ్వంభర, థగ్‌లైఫ్, బ్యాడ్ అండ్ అగ్లీ వంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, త్రిష మరో స్టార్ హీరో సరసన ఆఫర్ అందుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ సూర్య(Suriya ) నటిస్తున్న 45వ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు ఆమెకు వెల్‌కమ్ చెప్తూ మూవీ టీమ్ ట్వీట్ చేసింది.
అయితే ఆర్జే బాలాజీ(RJ Balaji) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్(Dream Warrior Pictures) బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. కాగా, సూర్య-త్రిష జోడీగా నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో ‘సూర్య-45’ (Surya-45)మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత వీరు కలిసి నటిస్తుండటం విశేషం.
Adding grace, charm, and power to #Suriya45 – welcome aboard, @trishtrashers ! A cinematic treat awaits🌟@Suriya_offl @RJ_Balaji @dop_gkvishnu @SaiAbhyankkar @prabhu_sr pic.twitter.com/nhXSf1I7va
— DreamWarriorPictures (@DreamWarriorpic) December 13, 2024