- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Heroine: 3287 రోజులుగా సినిమాల్లోనే.. కానీ ఒక్కటే హిట్.. ఆస్తులు చూస్తే మాత్రం మెంటల్ ఎక్కిపొద్ది!

దిశ, వెబ్‌డెస్క్: Heroine: చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఇందులోకి అడుగుపెడితే చాలు జీవితం రంగుల మయం. జీవితంలో దశ తిరగాలంటే సినిమాల్లోకి వెళ్లాల్సిందేనని చాలా మంది అనుకుంటారు. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదనే విషయం కొద్ది మందికే తెలుసు. కానీ ఒక్కసారి అదృష్టం వరిస్తే ఆ లెక్కే వేరుంటుంది.
ఈ మధ్య వస్తున్న హీరోయిన్లు ఇండస్ట్రీ గురించి ఎన్నో కళలు కంటున్నారు. కెమెరా ముందు కనిపించి క్రేజ్ కొట్టేయడంతో పాటు కోట్లు కూడబెట్టవచ్చని డిసైడ్ అవుతున్నారు. అలానే స్టార్ కిడ్ గా రంగంలోకి దిగి కెరీర్ ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు కోట్లు సంపాదిస్తోంది ఓ హీరోయిన్. అమెనే శ్రీదేవి కూతురు జాన్వీకపూర్.
ప్రస్తుతం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా జాన్వీ నిలిచింది. చిన్న వయసులోనే కోట్ల రూపాయల భారీ ఆస్తిపాస్తులను కూడబెట్టింది. వరుసగా హిట్స్ లేవు. ఆమె 9ఏళ్ల కెరీర్ మొత్తంలో చూస్తే ఒకే ఒక్క భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కానీ డిమాండ్ మాత్రం ఓ రేంజ్ లో ఉందనే చెప్పవచ్చు.
దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ హిందీలో వరుస సినిమాలు చేసింది. పలు కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోయినా రెమ్యూనరేషన్ పరంగా మాత్రం బాగా అందుకుంటోంది.
నిజానికి జాన్వీకపూర్ స్టార్ కిడ్ అయినప్పటికీ తన సొంత టాలెంట్ తో ఎదుగుతూ కోట్లు కూడబెడుతోంది. తల్లి స్టార్ హీరోయిన్ తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వీ సొంతంగా సంపాదిస్తూ దాదాపు 80కోట్ల మేర ఆస్తులు పోగు చేసిందని సమాచారం.
తాజాగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్..ఇక్కడా భారీ క్రేజ్ నే అందుకుంది. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. త్వరలోనే దేవర 2 కూడా చేయనుంది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేసే హంగామా మామూలుగా ఉండదన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.