- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జై బాబు,జై భీమ్, జై సంవిధాన్ ను విజయవంతం చేయాలి

దిశ, తలకొండపల్లి : రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని తలకొండపల్లి మండల ఇంచార్జ్ ఏనుగు జంగారెడ్డి, పీసీసీ సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని దేవకీ ఫంక్షన్ హాల్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జై బాపు, జై భీమ్,జై సంవిధాను కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఇంచార్జ్ ఏనుగు జంగారెడ్డి, పీసీసీ సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ యాట గీతలు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏనుగు జంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డోకుర్ ప్రభాకర్ రెడ్డి, నరసింహలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలకు అమలు చేస్తున్న పథకాలను గడపగడపకు తీసుకెళ్లి వివరించాలని పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై లేనిపోని కల్లి బొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని, కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీని 90 శాతం మేర పూర్తి చేశామని గుర్తు చేశారు. బిజెపి పార్టీ మతం పేరుతో రాజకీయం చేస్తూ మనసుల మధ్య తారతమ్యం తీసుకొస్తున్నారని, దేశమంటే మట్టికాదోయ్ మనుషులు అనే విధంగా మనం గుర్తు చేయాలని వారు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రతి పేదవాడి ఆకలిని తీరుస్తుందని తెలిపారు. గత పాలకులు ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలోకి నెట్టారని, ప్రస్తుతం వారు చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేక ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి విధిగా రావాలని, ఈనెల 15న వెంకటాపూర్ గ్రామం నుండి జై బాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ఒక సైనికుడి లాగా పని చేస్తూ వార్డు సభ్యుల స్థాయి నుండి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను గెలిపించుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది నాయకులు పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అది వారికి తగదని, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం మంచి పద్ధతి కాదని డోకూరు ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసే నాయకుడికి సహకరించాలి తప్ప వెనక నుండి గోతులు త్రవ్వకూడదని చురకలు అంటించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కేవలం ఎమ్మెల్యే వద్దకే ప్రతినిత్యం వెళుతూ, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యట నరసింహ, పిఎసిఎస్ ఛైర్పర్సన్ గట్ల కేశవ రెడ్డి, కిసాన్ సెల్ నాయకులు మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శతాబ్ది టౌన్ షిప్ ఏండి కాసు శ్రీనివాస్ రెడ్డి, సేవాలలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశరథ, ఏఏంసి డైరెక్టర్లు అంజయ్య గుప్తా, వెంకట్ రెడ్డి,అజీమ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, డిసిసి కార్యదర్శి రవీందర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాయకు, మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కేశవులు, మండల మాజీ అధ్యకులు జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ శర్మ, యాదయ్య, ఆంబాజీ,రాములు, నాయకులు డిగ్రీ కృష్ణ, పెరుమండ సురేష్, హారిప్, నరేష్,అజ్జీజు, గణేష్,డేవిడ్,బొల్ల యాదగిరి,రమేష్, పవన్ వాల్మీకి, తదితరులు పాల్గొన్నారు.