- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Head: 6 మ్యాచ్ ల నుంచి ఆ పేపర్ జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నాడు!

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ( Abhishek Sharma) సెంచరీ సందర్భంగా చూపించిన పేపర్ సీక్రెట్ రివిల్ చేశాడు ట్రావిస్ హెడ్ (Travis Head ). వాడు మామూలోడు కాదని... గత ఆరు మ్యాచ్ ల నుంచి ఆ పేపర్ను జేబులో పెట్టుకొని... తిరుగుతున్నాడని అభిషేక్ శర్మ పై ప్రశంసల వర్షం కురిపించాడు హైదరాబాద్ ఓపెనర్ హెడ్. దీనికి సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శనివారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది హైదరాబాద్ టీం. ఏకంగా పంజాబ్ కింగ్స్ జట్టు పైన ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ తో ఇరగదీశాడు హైదరాబాద్ యంగ్ డైనమిక్ ప్లేయర్ అభిషేక్ శర్మ. 40 బతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ పూర్తయిన తర్వాత... ఓ పేపర్ తీసి ఫ్యాన్స్ అందరికీ చూపించే సెలబ్రేషన్ చేసుకున్నాడు అభిషేక్ శర్మ. తన సెంచరీ ఆరెంజ్ ఆర్మీకి అంకితం అనే అర్థం వచ్చేలా ఇంగ్లీష్ పదాలను రాసుకున్నాడు.
ఆ పేపర్ ని గ్రౌండ్ లో ప్రదర్శించాడు అభిషేక్ శర్మ. అయితే ఈ పేపర్ సీక్రెట్ ను హెడ్ రివిల్ చేశాడు. ఇప్పుడే కాదు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ నుంచి ఆ పేపర్ను జేబులో పెట్టుకొని అభిషేక్ శర్మ తిరుగుతున్నాడని వెల్లడించాడు హెడ్. దీంతో అభిషేక్ శర్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొదటి మ్యాచ్ నుంచే సెంచరీ కొట్టాలనే కసితో ఆడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
Travis Head on Abhishek Sharma's Celebration.. pic.twitter.com/2XHCEkxGrN
— RVCJ Media (@RVCJ_FB) April 13, 2025