రాష్ట్రంలో అమానవీయ ఘటన.. కన్నకొడుకు డెడ్‌బాడీని నదిలో పడేసిన తండ్రి

by Shiva |
రాష్ట్రంలో అమానవీయ ఘటన.. కన్నకొడుకు డెడ్‌బాడీని నదిలో పడేసిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధునిక యుగంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఓవైపు వావివరుసలు లేకుండా కామాంధులు రెచ్చిపోతుంటే.. మరోవైపు కొందరు కన్నోళ్ల పట్ల కర్కషంగా వ్యవహరిస్తూ సభ్యసమాజానికి మాయనిమచ్చగా మారుతున్నారు. అచ్చం అలాంటి అమానవీయ ఘటనే కొమురు భీం ఆసీఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిర్పూర్ మండల పరిధిలోని టోంకినికి గ్రామానికి చెందిన రైతు చిరంజీవి వన్యప్రాణుల నుంచి తన పొలానికి రక్షణగా విద్యుత్ ఫెన్సింగ్ పెట్టాడు. ఈ క్రమంలోనే చిరంజీవి కొడుకు జయేందర్ (19) పొలానికి వెళ్లగా ఫెన్సింగ్ తాకి అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, నేరం ఎక్కడ తన మీదకు వస్తుందని భావించిన చిరంజీవి గుట్టుచప్పుడు, కుటుంబ సభ్యులకు కూడా తెలియనివ్వకుండా కొడుకు జయేందర్ మృతదేహాన్ని పెనుగంగ నదిలో పడేశాడు. అనంతరం తనకు ఏం తెలియనట్లుగా కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు జయేందర్ డెడ్‌బాడీని పెనుగంగ నదిలో గుర్తించారు. అయితే, మృతదేహంపై కరెంట్ షాక్ కొట్టిన గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి చిరంజీవిని ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ మేరకు నిందితుడు చిరంజీవి, మరో వ్యక్తి చెలిరాం‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story

Most Viewed