Inter Results-2025:ఏడాది చదువుకు దూరమైన విద్యార్థిని.. నేడు జిల్లా టాపర్

by Jakkula Mamatha |
Inter Results-2025:ఏడాది చదువుకు దూరమైన విద్యార్థిని.. నేడు జిల్లా టాపర్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిన్న(ఏప్రిల్ 12) ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కర్నూలు జిల్లా(Karnool District) ఆదోనికి చెందిన పేదింటి విద్యార్థిని నిర్మల ఇంటర్ బైపీసీలో 966 మార్కలతో జిల్లా టాపర్‌గా నిలిచింది. 2021-22లో పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 537 మార్కులు సాధించింది.

కానీ.. కుటుంబ ఆర్థిక పరిస్థుతుల దృష్ట్యా బాలిక చదువు మానేసింది. ఆర్థిక సమస్యలతో ఆమె ఏడాది పాటు చదువుకు దూరమైంది. కానీ ఆమెకు చదువుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈ తరుణంలో అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె ఆస్పరి KGBV లో చేరింది. ఆమె ఇంటర్ ఫస్టియర్ 420 మార్కులు సాధించింది. ఆమె IPS కావడమే తన లక్ష్యమని చెబుతోంది. ఈ క్రమంలో తన చదువు ఏడాది గ్యాప్ ఇచ్చిన మంచి ఫలితాలు సాధించింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఫలితాల్లో 966 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచి.. శభాష్ అనిపించుకుంది.



Next Story

Most Viewed