- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఛీ ఛీ అదేం టైటిల్.. స్టార్ హీరో మూవీపై జయాబచ్చన్ ఘాటు విమర్శలు..(పోస్ట్)

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య, ఎంపీ జయా బచ్చన్(Jaya Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పి విమర్శల పాలవుతుంటుంది. ఈ క్రమంలో మరోసారి స్టార్ హీరో సినిమా పై తీవ్ర విమర్శలు కురిపించింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘టాయిలెట్ - ఏక్ ప్రేమ్‌కథ’. ఇక దీనికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా.. భూమి ఫడ్నేకర్ హీరోయిన్‌గా నటించింది. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు 300 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని మరుగుదొడ్ల సమస్యను ప్రస్తావిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోరిక మేరకు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఓ భర్త ఏం చేశాడు ? అనేది ఈ సినిమా స్టోరీ. అయితే తాజాగా జయాబచ్చన్ ఈ మూవీ పై హాట్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఛీ ఛీ టాయిలెట్, ప్యాడ్ మ్యాన్ లాంటివి అసలు అదేం పేర్లు. నిజంగా అవి కూడా ఒక పేర్లేనా.. అది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా.. నా దృష్టిలో మాత్రం ఫ్లాప్ మూవీనే. అలాంటి సినిమాను నేను ఎప్పుడూ చూడను’ అని ఘాటు కామెంట్స్ చేసింది.
ఇక దీనిపై స్పందించిన అక్షయ్ కుమార్.. ‘ఒక మూర్ఖుడు మాత్రమే నా సినిమాను విమర్శించగలడు. టాయిలెట్-ఏక్ ప్రేమ్ కథ అనేది ప్రతి ఇంట్లో టాయిలెట్ నిర్మించడానికి చేసిన ప్రయత్నం. ప్యాడ్ మ్యాన్ శానిటరీ ప్యాడ్‌ల ప్రాముఖ్యత గురించి చెప్పడానికి. వీటి గురించి తెలుసుకోకుండా ఏ బేవకూఫ్ ఇలా విమర్శలు చేయరు’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.