‘శర్వా-37’ ఫస్ట్ లుక్ రివీల్ చేసేందుకు రాబోతున్న ఆ ఇద్దరు స్టార్స్.. డబుల్ పవర్ అంటూ ట్వీట్

by Hamsa |
‘శర్వా-37’ ఫస్ట్ లుక్ రివీల్ చేసేందుకు రాబోతున్న ఆ ఇద్దరు స్టార్స్.. డబుల్ పవర్ అంటూ ట్వీట్
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) నటిస్తున్న తాజా చిత్రం ‘శర్వా-37’. దీనిని రామ్ అబ్బరాజు(Ram Abbaraju) తెరకెక్కిస్తుండగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రవైట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్యం నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్(Samyukta Menon), సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ అండ్ కామెడీ నేపథ్యంలో రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, శర్వా-37 టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా ఇద్దరు స్టార్ హీరోలు రాబోతున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), నందమూరి బాలకృష్ణ(Balakrishna) వస్తున్నారు.. డబుల్ పవర్, ఎక్జైట్‌మెంట్ అంటూ రాసుకొచ్చారు.

Next Story