Pushpa -2 విడుదల కాకముందే పార్ట్-3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. ఖుషిలో ఫ్యాన్స్!

by Anjali |   ( Updated:2024-12-03 05:19:54.0  )
Pushpa -2 విడుదల కాకముందే పార్ట్-3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. ఖుషిలో ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ‘పుష్ప- 2’ (Pushpa) డిసెంబరు 5 వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో స్టార్ హీరో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), ఫాహద్ ఫాజిల్(Fahad Fazil), సునీల్(Sunil), అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj), జగపతి బాబు(Jagapathi Babu), రావు రమేశ్(Rao Ramesh) ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే నిన్న (డిసెంబరు 2 ) హైదరాబాదులో పుష్ప- 2 ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ వేదికపై మాట్లాడారు. పుష్ప- 3 గురించి అప్డేట్ ఇచ్చారు.

‘నిజానికి పుష్ప తీయడానికి నా దగ్గరున్న సీన్స్ ఒకటో, రెండో అంతేనని.. కానీ బన్నీ టాలెంట్ చూసి.. నన్ను నమ్మి ప్రోత్సహించిన తీరు చూసి ఏదైనా చేయొచ్చు అనిపించిందని సుకుమార్ వెల్లడించారు. అల్లు అర్జున్ ను మూడు సంవత్సరాలు కష్టపెట్టానని తెలిపారు. మరో మూడేళ్లు టైం ఇవ్వగలిగితే మాత్రం పుష్ప-3 (Pushpa)కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని దర్శకుడు వెల్లడించారు. ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్లు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ.. తను ఏం చెప్పినా వెళ్లి చేస్తుందని.. తన క్లోజప్ చూస్తూ కూర్చుండేవాడిని అంటూ సుకుమార్ తెలిపారు. తర్వాత అల్లు అర్జున్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్(famous music director Prasad) కూడా సినిమా గురించి.. వారు పడ్డ కష్టం గురించి మాట్లాడారు. మొత్తానికి పార్ట్- త్రీ గురించి సుకుమార్ నోట రావడంతో ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మూడో భాగం కూడా వస్తుందని జనాలు బలంగా నమ్ముతున్నారు.

Read More : Allu Arjun: స్టేజి మీదకు దూసుకొచ్చిన అభిమాని.. పిలిచి మరి ఫోటో ఇచ్చిన అల్లు అర్జున్

Advertisement

Next Story

Most Viewed