Unstoppable Talk Show: అన్‌స్టాప‌బుల్ షోకు విచ్చేసిన శ్రీలీల-న‌వీన్ పొలిశెట్టి.. తనలోని మరో కోణాన్ని బయటపెట్టిన డ్యాన్సింగ్ క్వీన్ (గ్లింప్స్)

by Anjali |
Unstoppable Talk Show: అన్‌స్టాప‌బుల్ షోకు విచ్చేసిన  శ్రీలీల-న‌వీన్ పొలిశెట్టి.. తనలోని మరో కోణాన్ని బయటపెట్టిన డ్యాన్సింగ్ క్వీన్ (గ్లింప్స్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ ప్రముఖ నటుడు బాలయ్య(Balakrishna) అన్‌స్టాపబుల్ టాక్ షో(Unstoppable Talk Show) కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో రీసెంట్‌గానే నాలుగో సీజన్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu) వచ్చి.. సందడి చేశారు. నెక్ట్స్ టాక్ షోలో మలయాళ స్టార్ కథానాయకుడు దుల్కర్ సల్మాన్(Malayalam star Dulquer Salmaan).. అలాగో అన్‌స్టాపబుల్ టాక్ షో మూడో సీజన్‌కు సూర్య(Sūrya) విచ్చేశారు. ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ మొదటగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) అండ్ ఈయనతో పాటు తమ పిల్లలు అయాన్(Ayan), అర్హ(Arha) కూడా వచ్చి జనాల్ని ఎంటర్‌టైన్ చేశారు.

బన్నీ వచ్చిన ఎపిసోడ్‌ను రెండు పార్ట్స్‌గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నెక్ట్స్ గెస్ట్‌గా వచ్చేదెవరో రీసెంట్‌గానే రివీల్ అయ్యింది. టాలీవుడ్ సెన్సేషనల్ నటి శ్రీలీల(Sreeleela) అండ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) వస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. గ్లింప్స్ చూసినట్లైతే.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల తన అదిరిపోయే డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. అంతేకాకుండా ఈ అమ్మడు వీణ కూడా వాయించింది. ఈ గ్లింప్స్ వీక్షించిన జనాలు.. ఈ కుర్ర హీరోయిన్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed