Sharwanand: ‘మనమే’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన టీమ్

by sudharani |
Sharwanand: ‘మనమే’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన టీమ్
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ప్రజెంట్ ‘నారీ నారీ నడుమ మురారీ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీస్ సంయుక్త (Samyukta), సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నేడు శర్వానంద్ బర్త్‌డే స్పెషల్‌ (Birthday special)గా రిలీజ్ చేసిన పోస్టర్‌కు కూడా నెట్టింట విశేష స్పందన లభిస్తుంది. ఇక శర్వానంద్ బర్త్‌డే స్పెషల్‌గా మరో అప్‌డేట్ కూడా వచ్చింది.

శర్వానంద్ గత ఏడాది ‘మనమే’ (Maname) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీలో కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్‌గా నటించింది. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య గతేడాది జూన్ 7 రిలీజైన ‘మనమే’ చిత్రం ఊహించిన ఫలితం దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈరోజు శర్వ బర్త్‌డే స్పెషల్‌గా ‘మనమే’ ఓటీటీ (OTT) స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సొంతం చేసుకోగా మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు డబుల్ ఎంజాయ్.. డబుల్ సెలబ్రేషన్ అనే క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రజెంట్ వైరల్‌గా మారింది.

Next Story