సమంత ఎమోషనల్ పోస్ట్.. ఆ రోజు ఎంతో కుంగిపోయాను.. నువ్వు వచ్చావు అంటూ..

by Sathputhe Rajesh |
సమంత ఎమోషనల్ పోస్ట్.. ఆ రోజు ఎంతో కుంగిపోయాను.. నువ్వు వచ్చావు అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత గరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చిత్ర పరిశ్రమలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక చైతూతో విడాకుల తర్వాత సామ్ కొంచెం అప్సెట్ అయినా తన కెరియర్‌పై ఫొకస్ పెట్టి వరస సినిమాలతో దూసుకెళ్తోంది. అయితే ప్రస్తుతం సామ్ ఏ చిన్న ట్వీట్ చేసిన అది సోషల్ మీడియాలో హల్ చల్ అవుతూనే ఉంటోంది. కాగా, శుక్రవారం దర్శకురాలు నందిని రెడ్డి పుట్టిన రోజు కావడంతో సమంత ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. 2012లో జరిగిన ఓ సంఘటనతో తాను ఎంతో కుంగిపోయానని సమంత వెల్లడించింది. తన కెరియర్ అక్కడితోనే ఆగిపోతానని భయపడిపోయాను కానీ ఆసమయంలో నాకు సపోర్టుగా ఉంటూ , నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపావు, ఆరోజు నువ్వు కలిగించిన స్ఫూర్తితో ఆ మరుసటి రోజే సినిమా రంగానికి పునరంకితం అయ్యానని వివరించింది. అంతే కాకుండా చాలా సమయాల్లో నాకు సపోర్టుగా ఉన్నావు నందూ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో తన దిగిన ఫొటోలను పోస్టు చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఇక సమంత నందిని రెడ్డికి మధ్య ఉన్న స్నేహం గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. వీరిద్దరు కలిసి సినిమాలు కాకుండా ఆహా సామ్-జామ్ షో వంటి పలు జాయింట్ వెంచర్లు కూడా చేశారు.

Advertisement

Next Story