- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sai Pallavi: ' ఇక మౌనంగా ఉండను' .. తప్పుడు రాతలు రాసిన ఎవరైనా సరే వదలనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సాయి పల్లవి
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ( Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా అమరన్ మూవీ గొప్ప విజయం సాధించడంతో సాయి పల్లవి రేంజ్ పెరిగింది. ప్రస్తుతం, బాలీవుడ్ లో రామాయణం మూవీలో నటిస్తుంది.
రామాయణంలో సీత పాత్రకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే, సాయి పల్లవి ఈ మూవీ కోసం తన అలవాట్లను మార్చుకుందని.. ఈ మూవీలో సీత పాత్ర చేస్తున్నందుకు ఆమె నాన్ వెజ్ మానేసి వెజిటేబుల్స్ తో చేసిన ఫుడ్స్ మాత్రమే తీసుకుంటుందని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, ఇన్ని రోజులు మౌనంగా ఉన్న సాయి పల్లవి తన సహనాన్ని కోల్పోయి .. ఇక సహించేది లేదంటూ ఇలాంటి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది.
తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ” ఇప్పటి వరకు వచ్చిన పుకార్లు, కల్పిత అబద్ధాలు/ తప్పుడు ప్రకటనలు పోస్టు లు పెడుతున్నప్పుడు నేను చాలా వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ,ఇప్పటి నుంచి అస్సలు ఊరుకోను. ఏ మీడియా లేదా ఏ సోషల్ పేజీ అయిన నా మీద తప్పుడు రూమర్లు రాసినా, చెప్పినా, మౌనంగా ఉండను , ఒకవేళ మీరు అలాగే రాసుకుంటూ వెళ్తే చట్టపరంగా వెళ్తానని" సాయిపల్లవి ట్వీట్ లో రాసుకొచ్చింది. దీంతో, సాయి పల్లవి చేసిన పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.