రిలీజ్‌కు ముందే రికార్డు బద్దలుకొట్టిన Pushpa - 2.. బుక్ మై షోలో ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయో తెలిస్తే షాక్..?

by Anjali |   ( Updated:2024-12-03 16:31:16.0  )
రిలీజ్‌కు ముందే రికార్డు బద్దలుకొట్టిన Pushpa - 2.. బుక్ మై షోలో ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయో తెలిస్తే షాక్..?
X

దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన పుష్ప-2 (Pushpa) మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ వీక్షించేందుకు పుష్పరాజ్(Pushparaj) ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) డిసెంబర్ 4 వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రీమియ‌ర్ షో(Premier shows)ల‌తో పాటు అర్థ‌రాత్రి 1 గంట‌కు, డిసెంబ‌ర్ 5 వ తారీకు మార్నింగ్ 4 గంట‌ల‌కు బెనిఫిట్ షోలు ప‌డ‌నున్నాయి. ఏకంగా 80 దేశాల్లో.. 6 భాష‌ల్లో 12 వేల‌కు పైగా థియేట‌ర్ల‌లో పుష్ప మూవీ సందడి చేయడం విశేషం. అయితే పుష్ప-2 అడ్వాన్స్ బుకింగ్ షురూ చేసింది. బుక్ మై షో(Book My Show)లో టికెట్స్ బుకింగ్స్ ఓపెన్(Tickets bookings open) చేయగా క్షణాల్లో టికెట్లన్నీ కేకుల్లా అమ్ముడుపోయాయి. బాక్సాఫీసు వద్ద యమ స్పీడ్‌గా ఏకంగా వన్ మిలియన్ టికెట్స్(One million tickets) అమ్ముడుపోయి.. పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన చిత్రంగా నిలిచింది. రీసెంట్‌గా హిందీ వెర్షన్(Hindi version) టికెట్స్ ఓపెన్ చేస్తే.. 24 గంటల్లోనే 1 లక్ష టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. దీంతో బాలీవుడ్(Bollywood) ఆల్ టైమ్ సినిమాల జాబితాలో సుకుమార్(SukumarSukumar) చిత్రం మూడో ప్లేస్‌లో స్థానం దక్కించుకుంది. విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోన్న పుష్ప-2.. రిలీజ్ అనంతరం మరెన్నీ రికార్డులు దక్కించుకుంటుందో అంటూ అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More...

Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాటలో అల్లు అర్జున్ ? వైరల్ అవుతున్న వీడియో


Advertisement

Next Story

Most Viewed