- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna : రష్మిక కెరీర్‌పై భారీ దెబ్బ కొడుతున్న మేనేజర్.. విషయమేంటంటే..?
దిశ, వెబ్‌డెస్క్: రష్మిక మందన గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. తన మేనేజర్‌తో వివాదాలు ఉన్నట్లు నెట్టింట పెద్ద ఎత్తున రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన రష్మిక, తన మేనేజర్ ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడిపోయామని.. వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పడింది అనుకుంటే.. తాజాగా మరోసారి రష్మిక, మేనేజర్ ఇష్యూ తెరపైకి వచ్చింది. విషయం ఏంటంటే..
కొన్ని వారాల క్రితం నితిన్, రష్మిక కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీ నుంచి రష్మిక తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ, పైకి మాత్రం డేట్స్ కుదరడం లేదని షాకులు చెప్తున్నారని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే.. రష్మిక ఈ సినిమాలో నుంచి తప్పుకోవడానికి ఆమె మాజీ మేనేజర్ కిరణ్ అంటూ ఫిలిం వర్గాల్లో టాక్. వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైనప్పటి నుంచి మాజీ మేనేజర్ రష్మిక గురించి నిర్మాతలు, దర్శకుల దగ్గర వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టాడట.
ఆమెకు టాలీవుడ్‌పై ఆసక్తి లేదని.. రష్మిక దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే ఉందంటూ నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టాడని టాక్. అంతే కాదు.. రష్మికకి ప్రత్యామ్నాయంగా అతడు శ్రీలీల, మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ల పేర్లని మేకర్స్ దగ్గర ప్రస్తావిస్తున్నాడట. ఈ వ్యవహారం రష్మిక దృష్టికి రావడంతో మనస్తాపానికి గురైందో లేక వేరే కారణమో తెలియదు కానీ ఆమె స్వయంగా నితిన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వినికిడి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరోసారి రష్మిక స్పందించాల్సి ఉంది.
Read More: The Kerala Story వివాదం.. కమల్ కామెంట్స్‌పై స్పందించిన ఆదా
‘బేబీ’ సినిమాకు ఆమెతో కలిసి వెళ్లిన విజయ్ దేవరకొండ.. రష్మికకు హ్యండిచ్చినట్టేనా అంటున్న నెటిజన్లు!